పుతిన్‌తో ట్రంప్‌ డీల్‌.. భారీగా డీజిల్‌ విడుదల! | Trump Putin Russia Diesel Deal | Sakshi
Sakshi News home page

పుతిన్‌తో ట్రంప్‌ డీల్‌.. భారీగా డీజిల్‌ విడుదల!

Oct 10 2026 1:26 AM | Updated on Oct 10 2026 1:36 AM

Trump Putin Russia Diesel Deal

అమెరికాలో డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక అడుగు వేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఇంధన ధరల తగ్గింపునకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఒప్పందంతో ప్రపంచ మార్కెట్లోకి భారీగా డీజిల్‌ అందుబాటులోకి రానుంది.

పుతిన్‌ వెంటనే 3 లక్షల టన్నుల డీజిల్‌ను విడుదల చేసేందుకు అంగీకరించారని ట్రంప్‌ తెలిపారు. నవంబర్‌లో మరో 5 లక్షల టన్నులు, ఆ తర్వాత 10 లక్షల టన్నుల డీజిల్‌ను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. డీజిల్‌ ధరలు వేగంగా తగ్గుతాయని ట్రూత్‌ సోషల్‌లో పోస్ట్‌ చేశారు.

అయితే, అమెరికాలో ఫిబ్రవరిలో ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి డీజిల్‌ ధరలు రెండింతలయ్యాయి. ప్రస్తుతం గ్యాలన్‌ డీజిల్‌ సగటు ధర 6.28 డాలర్లుగా ఉంది. సెప్టెంబర్‌ చివర్లో ఇది రికార్డు స్థాయిలో 6.53 డాలర్లకు చేరింది.

ట్రంప్‌ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే రష్యా డీజిల్‌ను మార్కెట్లోకి అనుమతిస్తూ అమెరికా ట్రెజరీ శాఖ తాత్కాలిక లైసెన్స్‌ జారీ చేసింది. అలాగే, రష్యా ప్రతినిధి కిరిల్‌ దిమిత్రియేవ్‌ ఈ ఒప్పందాన్ని స్వాగతించారు. ఇరు దేశాల ఇంధన రంగ సహకారం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు.

ఇంధన ధరలను తగ్గించేందుకు ట్రంప్‌ ఇప్పటికే పలు చర్యలు చేపట్టారు. గ్యాసోలిన్‌పై ఫెడరల్‌ పన్నును తాత్కాలికంగా నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అలాగే, జీ7 దేశాల నిల్వల నుంచి 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్‌ను విడుదల చేసేలా ఒత్తిడి తెచ్చారు.

ఇదీ చదవండి: పనామాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement