అత్యంత విలాసవంతమైన నగరాలు.. ముఖ్యంగా ఆ రెండూ..!

These 2 Cities Are Most Expensive In The World This Year New York Is 3rd - Sakshi

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో సింగపూర్‌,  స్విట్జర్లాండ్‌లోని  జ్యూరిచ్‌లు టాప్‌లో  నిలిచాయి.  ఈ ఏడాది మెస్ట్‌ ఎక్స్‌పెన్సివ్‌  సిటీస్‌  లిస్ట్‌లో తర్వాతి స్థానాల్లో జెనీవా, న్యూయార్క్‌, హాంకాంగ్‌లు ఆక్రమించాయి.  ఎకనామిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఈఐయూ) ఈ జాబితాను  గురువారం వెల్లడించింది.

స్థానిక కరెన్సీ పరంగా సగటున, 200 కంటే ఎక్కువ సాధారణంగా ఉపయోగించే వస్తువులు, సేవల కోసం ఈ ఏడాదిలో 7.4శాతం ధరలు పెరిగాయి, గత సంవత్సరం రికార్డు 8.1శాతం  పెరుగుదల నుంచి  కొద్దిగా   తగ్గింది. కానీ ఇప్పటికీ 2017-2021లో ట్రెండ్ కంటే  చాలా  ఎక్కువ అని  నివేదిక తెలిపింది.  అలాగే పలు కేటగిరీల్లో   అధిక ధరల కారణంగా సింగపూర్ గత పదకొండు సంవత్సరాల్లో తొమ్మిదవసారి ర్యాంకింగ్స్‌లో  అగ్ర స్థానాన్ని తిరిగి సాధించింది. 

కార్ నంబర్‌లపై కఠినమైన ప్రభుత్వ నియంత్రణల కారణంగా   సింగపూర్‌ప్రపంచంలోనే అత్యధిక రవాణా ధరలు నమోదైనాయి. దుస్తులు, కిరాణా , మద్యం లాంటి ఇతర అత్యంత ఖరీదైనవిగా నిలిచాయి. జెనీవా , న్యూయార్క్‌లు మూడో స్థానంలో ఉండగా, హాంకాంగ్ ఐదు, లాస్ ఏంజెల్స్ ఆరో స్థానంలోనూ నిలిచాయి. ఇతర ప్రాంతాలతో  పోలిస్తే ఆసియా సగటున తక్కువ ధరల  పెరుగుదల  కొనసాగింది. జపాన్‌లోని ఒసాకా , టోక్యోతో పాటు, చైనాలోని నాన్జింగ్, వుక్సీ, డాలియన్, బీజింగ్ - ర్యాంకింగ్‌లలో  ఈర్యాంకింగ్స్‌లో పతనమైన అతి పెద్ద నగరాలు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top