ప్రియుడు మోసం చేశాడన్న కోపంతో... భవనానికి నిప్పంటించి...

Taiwanese Woman Fire To Embarrass Her Boyfriend,She Suspect Chats - Sakshi

కొంతమంది ప్రేమ పేరుతోనే లేక స్నేహితులు కారణంగానో తెలిసో/ తెలియకో దారుణంగా మోసపోతుంటారు. దీంతో వారు ఆ మోసాన్ని జీర్ణించు కోలేకపోవడమే గాక మరోకర్ని నమ్మాలన్న భయపడుతుంటారు. ఇలాంటి పరిస్థితి నుంచి సాధ్యమైనంత తొందరగా బయటకొచ్చేందుకు యత్నించాలి గానీ తనను తాను గాయపర్చుకోవడమే లేక పక్కవారికి హాని తలపెట్టడమో చేయకూడదు. ఇక్కడొక మహిళ అలాంటి దారుణానికి ఒడిగట్టి కటకటాలపాలైంది.

వివరాల్లోకెళ్తే....తైవాన్‌లోని 51 ఏళ్ల హువాంగ్ కే కే అనే మహిళ తన ప్రియుడు మోసం చేశాడన్న కోపంతో కాహ్‌సియుంగ్‌లో ఉన్న బహుళ అంతస్తుల భవనానికి నిప్పంటించింది. దీంతో సుమారు 46 మృతి చెందగా, దాదాపు 41 మంది గాయపడ్డారు. దీంతో పోలీసులు ఆమెపై హత్య నేరం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే కోర్టులో ఆమె ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడిందని, పైగా ఆమెలో పశ్చాత్తాపం కూడా లేదంటూ ఉరితీయాలని డిమాండ్‌ చేశారు న్యాయవాదులు.

అయితే కోర్టు విచారణలో ఆమెను దోషిగా నిర్థారించింది గానీ భవనంలోని నివాసితులకు నష్టం కలిగించే ఉద్దేశ్యం ఆమెకు లేదని పేర్కొంది. అంతేకాదు ఆమె ఉద్దేశ్యపూర్వకంగా ఈ ఘటనకు పాల్పడలేదని కూడా స్పష్టం చేసింది. ప్రియుడు మోసం చేయడంతో జీర్ణించుకోలేక ఆవేశంతో సదరు వ్యక్తిని ఇబ్బందులకు గురిచేసేందుకు ఈ ఘటనకు పాల్పడినట్లు పేర్కొంది.

పైగా దీన్ని ఉద్రేకపూరితమైన చర్యగా భావించి కోర్టు ఆమెకు జీవిత ఖైదు జీవించింది. ఐతే ఆమె తన నేరాన్ని కోర్టులో ఒప్పుకుంది, కానీ ఈ ఘటనకు ప్పాలడే ముందు ఏ జరిగిందనేది అస్పష్టంగా ఉంది. అదీగాక ఈ తీర్పుతో అసంతృప్తి చెందిన న్యాయవాదులు పై కోర్టుకి అప్పీలుకి వెళ్తామని తేల్చి చెప్పారు.

(చదవండి: నైట్‌క్లబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. పలువురి దుర్మరణం​)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top