మరికొన్ని గంటల్లో ఇరాన్‌ని నాశనం చేస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇవ్వడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రపంచమంతా ఆందోళన పడుతోంది. మరోవైపు ఇరాన్ కూడా వేల క్షిపణలు, డ్రోన్లని సిద్ధం చేసి యుద్ధానికి సిద్ధమవుతోంది. సరిగ్గా ఈ టైంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్తాన్ ప్రధాని షబాజ్ షరీఫ్ ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. ఇరాన్‌కి ఇచ్చిన గడువుని మరో రెండు వారాలు పొడిగించాలని ట్రంప్‌ని కోరుతూ ట్వీట్ చేశారు.
(ఇదీ చదవండి: 15 వేల క్షిపణులు.. 45 వేల డ్రోన్లతో ఇరాన్ రెడీ)
లెక్క ప్రకారం ఇరాన్ హోర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలని అమెరికా, బుధవారం ఉదయం వరకు గడువు విధించింది. లేదంటే దాడులు చేస్తామని హెచ్చరించింది. ఈ క్రమంలో పాక్ ప్రధాని అటు ట్రంప్‌ని ప్రాధేయపడుతూ ట్వీట్ చేశారు. ఇందులోనే ఇరాన్‌ని ఉద్దేశిస్తూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
'మధ్య ప్రాచ్యంలో జరుగుతున్న సంఘర్షణకు శాంతియుత పరిష్కారం కోసం దౌత్యపరమైన ప్రయత్నాలు వేగంగా కొనసాగుతున్నాయి. అతి త్వరలో ఫలితం ఉంటుంది. అందుకే ఇరాన్‌కి విధించిన గడువుని రెండు వారాలు పొడిగించాలని కోరుతున్నాను. ఇరాన్ కూడా హోర్మూజ్ జలసంధిని రెండు వారాల పాటు తెరవాలి. అదే సమయంలో అన్ని పక్షాలు కాల్పుల విరమణ ప్రకటించాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను అని షెబాజ్ షరీఫ్ రాసుకొచ్చారు.
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, పాకిస్తాన్ లాంటి దేశాలు మధ్యవర్తిత్వం చేస్తూ పరిస్థితిని చల్లబరచే ప్రయత్నాలు చేస్తున్నాయి. పూర్తిస్థాయి యుద్ధాన్ని నివారించేందుకు దౌత్య చర్చలు కీలకంగా మారాయి. చూడాలి మరి షరీఫ్ ట్వీట్‌ని పరిగణలోకి తీసుకుని గడువుని పెంచుతారా అనేది చూడాలి?
(ఇదీ చదవండి: యుద్ధ ప్రభావం.. కువైట్‌లో ప్రభుత్వ హెచ్చరికలు)


