15 వేల క్షిపణులు.. 45 వేల డ్రోన్లతో ఇరాన్ రెడీ | Iran Counter Attack Trump With Armed Equipment Latest | Sakshi
Sakshi News home page

Iran War: ట్రంప్‌ బెదిరింపులకు దీటుగా బదులిచ్చిన ఇరాన్‌

Apr 8 2026 12:22 AM | Updated on Apr 8 2026 12:22 AM

Iran Counter Attack Trump With Armed Equipment Latest

అమెరికా అ‍ధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్ కి ఇచ్చిన గడువు మరికొన్ని గంటల్లో ముగిసిపోనున్న వేళ.. పశ్చిమాసియాలో యుద్ధం తారాస్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఇరాన్ ని ఒక్కరాత్రిలో తుడిచిపెట్టేస్తానని ట్రంప్ అల్టిమేటం ఇవ్వడం ఉత్కంఠకి గురిచేస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా ఏ మాత్రం తగ్గకుండా ట్రంప్ బెదిరింపులకు దీటుగా బదులిచ్చింది.

తమ వద్ద 15 వేల క్షిపణులు సిద్ధంగా ఉన్నాయని ఇరాన్‌ స్పష్టం చేసింది. అలానే 45 వేల డ్రోన్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపింది. మరోవైపు తమ దేశ ప్రజలను కూడా ఇరాన్‌ అప్రమత్తం చేసింది. ప్రజలంతా ఇంటి లోపలే ఉండాలని.. విద్యుత్ కేంద్రాలు, సైనిక కేంద్రాలకు దూరంగా ఉండాలని సూచించింది. అలానే బహుళ అంతస్తుల భవనాలకు దూరంగా ఉండాలని ఇరాన్‌ ప్రభుత్వం సూచించింది.

Advertisement
 
Advertisement
Advertisement