యుద్ధ ప్రభావం.. కువైట్‌లో ప్రభుత్వ హెచ్చరికలు | Kuwait Govt Ask People Stay Indoors | Sakshi
Sakshi News home page

Kuwait Govt: అప్పటివరకు ఇంటి నుంచి బయటకు రావొద్దు

Apr 8 2026 12:05 AM | Updated on Apr 8 2026 12:05 AM

Kuwait Govt Ask People Stay Indoors

ఇరాన్‌కి అమెరికా అధ్యక్షుడు ఇచ్చిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. దీంతో పశ్చిమాసియా అంతటా ఉత్కంఠ, ఆందోళన నెలకొంది. ఇరాన్‌ని ఒక్క రాత్రిలో తుడిచిపెట్టేస్తామని ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. మరోవైపు ఇరాన్ కూడా ఏ మాత్రం లెక్కచేయట్లేదు. వెనక్కి తగ్గేదే లేదని వార్నింగ్స్ ఇస్తున్నారు. ఈ పరిణామాల వల్ల ఏం జరుగుతుందోనని పశ్చిమాసియాలోని ఇతర దేశాలు కూడా భయపడుతున్నాయి. ఈ క్రమంలోనే కువైట్ ప్రభుత్వం తమ దేశ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది.

పౌరులంతా బుధవారం ఉదయం 6 గంటల వరకు ఇళ్లలోనే ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని కువైట్ హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ క్షిపణి దాడులు జరిపే ప్రమాదం ఉండడంతోనే కువైట్.. తన పౌరులను హెచ్చరించింది.

 

Advertisement
 
Advertisement
Advertisement