
లాహోర్: పాకిస్తాన్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లాహోర్ సమీపంలో రైలు పట్టాలు తప్పడంతో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. లాహోర్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ఇస్లామాబాద్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
పాకిస్తాన్ రైల్వేలు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం సాయంత్రం లాహోర్ నుండి రావల్పిండికి వెళ్తున్న ఇస్లామాబాద్ ఎక్స్‌ప్రెస్.. షేక్‌పురాలోని కాలా షా కాకు వద్ద పట్టాలు తప్పింది. రైలులోని 10 బోగీలు పట్టాలు తప్పడంతో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సహాయక బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి.
🚨🇵🇰 Train Derailment in Pakistan
⚠️ Islamabad Express derailed near Kala Shah Kaku (Muridke).
🚑 Over 40 passengers injured, rescue teams on site.
📍 Cause of derailment under investigation.#Pakistan #TrainAccident #Breaking pic.twitter.com/O6yhz5aBKR— ARIKA🇮🇳🚩 (@nidhisj2001) August 1, 2025
ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. లాహోర్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరిన అరగంటకు రైలు బోగీలు పట్టాలు తప్పాయని తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే మంత్రి ముహమ్మద్ హనీఫ్ అబ్బాసి వెంటనే రైల్వే సీఈఓ, డివిజనల్ సూపరింటెండెంట్‌ను అప్రమత్తం చేశారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుని, పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి ఏడు రోజుల్లోగా విచారణ ఫలితాలను సమర్పించాలని ఆదేశించారు.