Russia Ukraine war: ఉక్రెయిన్‌ జైలుపై భీకర దాడి.. 53 మంది మృత్యువాత!

Russia Attacks On Prison In Ukraine With Rockets Several Dead - Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌లోని యుద్ధ ఖైదీలను నిర్బంధించిన జైలుపై శుక్రవారం జరిగిన భీకర రాకెట్‌ దాడిలో 53 మంది చనిపోగా మరో 75 మంది గాయపడ్డారు. మరియుపోల్‌ నగరం హస్తగతమయ్యాక యుద్ధ ఖైదీలుగా చిక్కిన ఉక్రేనియన్లను రష్యా అనుకూల వేర్పాటు వాదులు ఒలెనివ్‌కా జైలులోనే ఉంచారు. ఈ ఘటనపై ఉక్రెయిన్, రష్యా పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.  

అమెరికా రాకెట్‌ లాంఛర్లతోనే ఉక్రెయిన్‌ బలగాలు ఈ దాడి చేశాయని రష్యా ఆరోపించింది. ఘటన ప్రాంతంలో పడిన అమెరికా తయారీ రాకెట్‌ విడిభాగాలను కనుగొన్నట్లు అధికార నొవొస్తి వార్తా సంస్థ తెలిపింది. ఉక్రేనియన్లపై చిత్రహింసలు, మరణశిక్షల అమలును కప్పిపుచ్చుకునేందుకు రష్యానే ఈ దాడికి పాల్పడినట్లు ఉక్రెయిన్‌ ఆరోపించింది.

ఇదీ చదవండి: డైనోసార్‌ అస్థిపంజరానికి 49 కోట్లు..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top