అత్యంత తక్కువ ఎత్తులో విమానం ల్యాండింగ్‌.. వీడియో వైరల్‌!

A Plane Making Lowest Ever Landing At Skiathos Airport Greece - Sakshi

ఎథెన్స్‌:  గ్రీస్‌లోని స్కియాథోస్‌ విమానాశ్రయం సుందరమైన వీక్షణలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ విమానాలు దిగడాన్ని చూడటానికి ప్రతిరోజూ వందలాది మంది పర్యాటకులు ల్యాండింగ్ ప్రాంతాన్ని సందర్శిస్తారు. విమానాల ల్యాండింగ్‌, టేకాఫ్‌ను వీక్షించేందుకు రోజుకు సుమారు 100 మందికిపైగా ఇక్కడి వస్తారు. ఈ విమానాశ్రయం ఇతర అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల్లా అంత పెద్దగా ఉండదు. చిన్న రన్‌వే ఉంటుంది. ఇక్కడ దిగేందుకు అనుమతి పొందిన అతిపెద్ద విమానం బోయింగ్‌ 757. 

ఇటీవల ఓ ప్రయాణికుల విమానం అత్యంత తక్కువ ఎత్తులో ల్యాండింగ్‌ చేసిన విధానాన్ని చాలా మంది ఆశ్వాదించారు. ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయగా వైరల్‌గా మారాయి. విజ్‌ఎయిర్‌ ఎయిర్‌బస్‌ ఏ321నియో ప్లేన్‌.. సముద్ర నీటిని తాకుందా అన్నట్లు వెళ్తూ.. అలెగ్జాండ్రోస్‌ పపడియామంటిస్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. ల్యాండింగ్‌కు కొద్ది సెకన్ల ముందు విమానం ముందు టైర్లు రోడ్డుపై ఉన్న వారిని తాకుతాయా అన్నట్లు కనిపించింది. రన్‌వే ఫెన్సింగ్‌ దాటిన క్రమంలో ఆ గాలికి అక్కడి వారు దూరంగా పడిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియోను గ్రేట్‌ఫ్లైయర్‌ యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసింది. స్కియథోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం 5,341 అడుగుల రన్‌వే కలిగి ఉంటుంది. అతితక్కువ పొడవు, తక్కువ వెడల్పుతో ఉండటం దీని ప్రత్యేకత. ఈ ఎయిర్‌పోర్ట్‌ 1972లో ప్రారంభమైంది.

ఇదీ చదవండి: దక్షిణాఫ్రికాలోని ఒక పట్టణం...అక్కడ అంతా శ్వేత జాతీయులే!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top