కుప్పకూలిన విమానం; ఐదుగురు మృతి | Plane Crashes in Congo South Kivu Province In Africa | Sakshi
Sakshi News home page

కాంగోలో కుప్పకూలిన విమానం; ఐదుగురు మృతి

Aug 15 2020 10:15 AM | Updated on Aug 15 2020 10:16 AM

Plane Crashes in Congo South Kivu Province In Africa - Sakshi

కాంగో : ఆఫ్రికా దేశ‌మైన కాంగోలో శుక్రవారం అర్థరాత్రి కార్గో విమానం అడ‌వుల్లో కుప్ప‌కూలింది. ఈ ప్ర‌మాదంలో ఇద్దరు పైల‌ట్లు స‌హా ఐదుగురు మృతిచెందారు. ఏజ్‌ఫ్రెకో అనే కంపెనీకి చెందిన చిన్న కార్గో మ‌నీమా ప్రావిన్స్‌లోని క‌లిమా నుంచి ద‌క్షిణ కివూ ప్రావిన్స్‌లోని బుకావు వెళ్తున్న‌ది. మ‌రికొద్ది సేప‌ట్లో లాండింగ్ అవుతుంద‌న‌గా ద‌క్షిణ కివూ ప్రావిన్స్‌లోని ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతంలో కూలిపోయింది. అందులో ఇద్ద‌రు పైల‌ట్ల‌తోపాటు ముగ్గురు ప్ర‌యాణికులు ఉన్నార‌ని, ప్ర‌మాదంలో అంద‌రూ మ‌ర‌ణించార‌ని ప్రావిన్స్ ర‌వాణ, స‌మాచార శాఖ మంత్రి క్లౌడీ స్వీడి బా‌సిలా తెలిపారు.

ఈ విమాన ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై అమెరికా మిష‌న్ బృందం ద‌ర్యాప్తు చేస్తున్న‌ద‌ని వెల్ల‌డించారు. కాంగోలో భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు స‌రిగా పాటించ‌క‌పోవ‌డం వ‌ల్ల విమానాలు త‌ర‌చూ ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్నాయి. దీంతో స‌రైన భద్ర‌తా ప్ర‌మాణాలు పాటించ‌ని కార‌ణంగా యూరోపియ‌న్ యూనియ‌న్ కాంగో విమాన స‌ర్వీసుల‌పై నిషేధం విధించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement