ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ మేరకు ఇరుదేశాల ప్రతినిధులు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చర్చలని అత్యంత కీలకమైనవిగా చెప్పుకొచ్చారు. చర్చలు జరిగితే అంత సవ్యంగా సాగుతుందని లేదంటే సర్వనాశనం అవుతుందని అర్థం వచ్చేలా 'మేక్ ఆర్ బ్రేక్' అని పేర్కొన్నారు.
(ఇదీ చదవండి: US-Iran: పాక్ ప్రధానిపై ప్రశంసలు.. ఓవరాక్షన్ అవసరమా?)
శనివారం నుంచి ఇస్లామాబాద్‌లో ఈ చర్చలు ప్రారంభమవుతాయని, ఇందులో అమెరికా, ఇరాన్ దేశాల ఉన్నతస్థాయి ప్రతినిధులు పాల్గొననున్నారని షరీఫ్ తెలిపారు. ఈ చర్చలకు ఆతిథ్యం ఇవ్వడం పాకిస్తాన్‌కే కాకుండా మొత్తం ముస్లిం ప్రపంచానికి గర్వకారణమని అన్నారు. తన అభ్యర్థన మేరకు కాల్పుల విరమణకు అంగీకరించి, చర్చలకు సిద్ధమైనందుకు ఇరుదేశాలకు ధన్యవాదాలు తెలిపారు. శాంతి చర్చలు విజయవంతమవడానికి తమ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని, ప్రజలు ప్రార్థనలు చేయాలని షరీఫ్ కోరారు.
ఇటీవల అమెరికా-ఇరాన్ దేశాల ఉద్రిక్తతల నేపథ్యంలోనే ట్రంప్ రెండు వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించారు. పాక్ మధ్యవర్తిత్వం వహిస్తుండగా ఇస్లామాబాద్ వేదికగా శనివారం నుంచి శాంతి చర్చలు జరగనున్నాయి.
ఇకపోతే పాకిస్థాన్ ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ ఇంధన ధరలని తగ్గిస్తున్నట్లు ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. రూ.520గా ఉన్న డీజిల్ లీటర్ ధరని రూ.385కు.. రూ.378గా ఉన్న లీటర్ పెట్రోల్ లీటర్ ధరని నుంచి రూ.366కు తగ్గించారు.
(ఇదీ చదవండి: ఆయుధాలతో నౌకలు సిద్ధం.. చర్చలకు ముందే ట్రంప్ వార్నింగ్)


