Australian Space Agency Reveals Secret Behind Mystery Object Found At Australian Beach, Know In Details - Sakshi
Sakshi News home page

Australian Beach Mystery Object Secret: అవును.. అది భారత్‌కు చెందిన PSLV రాకెట్‌ భాగం: ఆస్ట్రేలియా స్పేస్‌ ఏజెన్సీ అధికారిక ప్రకటన

Jul 31 2023 3:23 PM | Updated on Jul 31 2023 5:17 PM

Mystery Object Fount At Australian Beach Part Of Indian Rocket - Sakshi

బీచ్‌ ఒడ్డుకు కొట్టుకొచ్చిన వస్తువు ఏమై ఉంటుందా? అనే మిస్టరీ.. 

ఆస్ట్రేలియా ఒడ్డుకు కొట్టుకొచ్చిన అంతుచిక్కని వస్తువు మిస్టరీ వీడింది. అది భారత్‌కు చెందిన రాకెట్‌దేనని అక్కడి అధికారులు ప్రకటించారు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు ఉత్తరాన రెండు గంటల ప్రయాణంలో ఉన్న జురియన్ బే సమ్పీంలో జులై మధ్యవారంలో ఈ వస్తువు తొలిసారిగా కనిపించింది. ఆరు ఫీట్ల ఎత్తు.. కేబుల్స్‌ వేలాడుతూ కనిపించింది అది.  ఆ సమయంలో ఇది చంద్రయాన్‌-3కి చెందిన శకలం అంటూ ప్రచారాలు చేశారు కొందరు. 

మరోవైపు ఇంకొందరు తొమ్మిదేళ్ల కిందట అదృశ్యమైన మలేషియా ఎయిర్‌లైన్స్‌ ఫ్లైట్‌ MH 370 విమానందేమో అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఈ తరుణంలో ఆస్ట్రేలియన్‌ స్పేస్‌ ఏజెన్సీ దానిని అధ్యయనం చేసి సోమవారం ఒక ప్రకటన చేసింది. 

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన పోలార్‌ శాటిలైట్‌ లాంఛ్‌ వెహికిల్‌(PSLV)కి చెందిన శకలమని ప్రకటించారు అధికారులు. అయితే.. అంతర్జాతీయ ఒప్పందాల పరిధిలోకి లోబడి ఇరు దేశాలు సంయుక్త ప్రకటన వెలువరించాల్సి ఉందని ఆస్ట్రేలియా స్పేస్‌ ఏజెన్సీ చెబుతోంది. అయితే తాము పరిశీలించిన తర్వాతే ప్రకటన చేస్తామని ఇస్రో ఇదివరకే ప్రకటించగా..  ఇక అది ఎప్పటిది అనే దానిపై ఇస్రో అధికారులే స్పష్టత ఇవ్వాల్సి ఉంది. 

PSLV ప్రయోగ దశల్లో ఇలా శలాలను సముద్రంలో పడేయడం సాధారణంగా జరిగేదే.  ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా తీరానికి ఇలాంటి స్పేస్‌జంక్‌ కొట్టుకురావడం ఇదే తొలిసారి కాదు. గత ఆగష్టులో ఎలన్‌ మస్క్‌ స్పేస్‌ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌ రాకెట్‌ శకలం న్యూసౌత్‌వేల్స్‌లోని ఓ గడ్డి మైదనాంలో పడగా.. ఓ గొర్రెల కాపరి దానిని గుర్తించి అధికారులకు సమాచారం అందించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement