ట్యునీషియా తీరంలో బోటు మునక: 50 మంది గల్లంతు

Migrants Boat Drowned Off In Tunisia - Sakshi

ట్యునిస్‌: ఉత్తర ఆఫ్రికా దేశం ట్యునీషియా తీరంలో వలసదారులతో వస్తున్న పడవ మునిగిపోవడంతో అందులోని సుమారు 50 మంది గల్లంతయ్యారు. మరో 33 మందిని సమీపంలోని చమురు సంస్థ సిబ్బంది కాపాడారు. ఎస్‌ఫాక్స్‌ తీరంలో ఈ ఘటన చోటు చేసుకుందని ట్యునీషియా రక్షణ శాఖ తెలిపింది. సురక్షితంగా బయటపడిన వారంతా బంగ్లాదేశీయులేనని అంతర్జాతీయ వలసదారుల సంస్థ పేర్కొంది.

లిబియాలోని జవారా రేవు నుంచి బయలుదేరిన ఈ పడవలో 90 మంది వరకు ఉంటారని తెలిసిందని ప్రకటించింది. యూరప్‌ వెళ్లాలనుకునే వలసదారులు లిబియా మీదుగా ప్రమాదకరమైన ఈ మధ్యదరా సముద్ర మార్గాన్ని ఎంచుకుంటున్నారు.
చదవండి: ఇజ్రాయెల్, హమాస్‌ మధ్య దాడులు, ప్రతిదాడులు  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top