పిచ్చి పట్టిందా.., పారాచుట్ లేకుండా విమానం నుంచి దూకేశాడు..

Man Jumped Out Of A Plane Without A Parachute From 25,000 Feet In America - Sakshi

ప్రాణాలతో చెల‌గాటం

పారాచుట్ లేకుండా విమానం నుంచి డ్రైవ్  

చిప్ దొబ్బిందా అంటూ నెటిజ‌న్ల కామెంట్స్‌

వాషింగ్టన్ డిసి : పారా చుట్ లేకుండా స‌ర‌దాగా విమానం నుంచి దూకితే ఎలా ఉంటుంది? అని ఎవ‌రితోనైనా చెబితే ఏం ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని అనిపిస్తుందా?. వెళ్లి డాక్ట‌ర్ కి చూయించుకోమ‌ని స‌ల‌హా ఇస్తారు. సరిగ్గా ఇలాగే ఓ వ్యక్తి త‌న స్నేహితుల‌తో అలాగే చెప్పాడు. చెప్ప‌డ‌మే కాదు పారా చుట్ లేకుండా విమానం నుంచి దూకి గిన్నీస్ వ‌రల్డ్ రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని టెక్సాక్ కు చెంది ఐకిన్స్ వృత్తి రిత్యా పైలెట్‌. స్కై డ్రైవ‌ర్ కూడా. ఇటీవ‌ల ఐకిన్స్ పారాచుట్ లేకుండా విమానం నుంచి కింద‌కి దూకాడు. దీంతో ఆయ‌న అభిమానులు, స‌న్నిహితులు సంతోషం వ్య‌క్తం చేశారు. అయినా ఇలాంటి ప్ర‌మాద‌క‌రమైన విన్యాసాలు చేయ‌డం ఐకిన్స్ కు కొత్తేమి కాదు.  

2016 లో పారాచూట్ లేకుండా విమానం నుండి దూకి  గిన్నిస్ వ‌రల్డ్ రికార్డును బద్దలుకొట్టాడు. తాజాగా 25,000వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానం నుంచి కింద‌కి దూకాడు. కింద ప‌డే స‌మ‌యంలో 150 చ‌ద‌ర‌పు అడుగుల ప‌రిమాణంలో ఉన్న నెట్ లోకి జారేలా ప్లాన్ చేశాడు. అత‌నికి  ఐర‌న్ మ్యాన్ చిత్రానికి స్టంట్‌గా ప‌నిచేసిన ప్రొఫెష‌నల్ స్కైడ్రైవ‌ర్ ఫెలిక్స్ సాయం చేయ‌డంతో గాల్లో నుంచి సునాయాశంగా కింద‌కి దూకాడు. 

ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ వీడియోల‌పై ప‌లువురు నెటిజ‌న్లు అత‌ని సాహ‌సానికి ఫిదా అవుతుంటే, చిప్ దొబ్బిన‌ట్లుంది అందుకే ఇలాంటి సాహ‌సం చేస్తున్నాడంటూ మరికొంత‌మంది సెటైర్లు వేస్తున్నారు. 

చ‌ద‌వండి : Corona: వేపచెట్ల కిందే చికిత్స... ప్రాణం నిలుస్తోంది!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top