
కౌలాలంపూర్: సాధారణంగా మనం డ్రెస్ వేసుకోవడానికి ఎంత లేదన్న ఐదు నిమిషాల సమయం అయినా పడుతుంది. అదే ఇక ఆడవారు చీర కట్టుకోవాలంటే 15-30 నిమిషాల సమయం తీసుకుంటారు. కొత్తగా చీర కట్టడం నేర్చుకునేవారు అంతకన్నా ఎక్కువ సమయం కూడా తీసుకుంటారు. కానీ నిమిషం వ్వవధిలో అనగా.. 60 సెకన్ల కాలంలో 65 డ్రెస్సులు మార్చి ప్రపంచ రికార్డు సృష్టించి వారిని ఎక్కడైనా చూశారా.. లేదా అయితే ఇది చదవండి
మలేషియాకు చెందిన ఓ మహిళ నిమిషం వ్యవధిలో 65 డ్రెస్సులు మార్చి.. ఔరా అనిపించింది. అది కూడా స్టేజీ మీద. అదేలా సాధ్యం అంటే.. మ్యాజిక్. ఎవరీ చిన్, సిల్వియా లిమ్ అనే ఈ జంట చేసిన ప్రదర్శన ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. ఈ ప్రదర్శనలో భాగంగా మహిళ స్టేజీ మీద నిల్చుని ఉంటుంది. ఆమె భర్త మ్యాజిక్ చేసే వాళ్లు ఉపయోగించే పెద్ద వస్త్రాన్ని ఆమె మీద కప్పుతాడు. దాన్ని కిందకు తీయగానే ఆమె ఒంటి మీద డ్రెస్ మారుతూ ఉంటుంది. ఇలా నిమిషం వ్యవధిలో ఈ జంట 65 డ్రెస్సులు మార్చినట్లు ఇల్యూషన్ ప్రదర్శిస్తారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది.