రెబల్స్‌తో భీకర పోరులో ఐసిస్‌ చీఫ్ హతం.. కొత్త అధినేతను ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్..

Islamic State Announced That Their Leader Had Been Killed In Battle - Sakshi

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అధినేత హసన్ అల్ హషిమీ అల్ ఖురేషి హతమయ్యాడు. సిరియా తిరుగుబాటు శక్తులతో జరిగిన భీకర పోరులో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని ఐసిస్ బుధవారం ఓ ఆడియో సందేశంలో తెలిపింది. తమ కొత్త నాయకుడిగా అబు అల్ హుస్సేన్ అల్ హుస్సేనీ అల్ ఖురేషిని ఎన్నుకున్నట్లు చెప్పింది.

ఐసిస్ అధినేత మరణాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి కూడా ధ్రువీకరించారు. ఈయన సిరియాలో అమెరికా దళాలను పర్యవేక్షిస్తున్నారు. అక్టోబర్ నెల మధ్యలో దక్షిణ  సిరియా రెబల్స్.. హసన్ అల్ హమిషీని హతమార్చినట్లు పేర్కొన్నారు.

ఐసిస్‌ చీఫ్‌గా హసన్ అల్ హషిమీ 9 నెలల క్రితమే బాధ్యతలు చేపట్టాడు. అతనికి ముందు ఈ ఉగ్రవాద సంస్థకు నాయకుడిగా అబు ఇబ్రహీం ఖురేషి ఉండేవాడు. అమెరికా దళాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో అతడ్ని సిరియాలో మట్టుబెట్టాయి.
చదవండి: అఫ్గాన్‌ మదరసాలో పేలుళ్లు... 16 మంది దుర్మరణం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top