ఆరు నెలలు నీటి అడుగున ఐఫోన్‌ 11, అయినా కూడా..

iPhone 11 Working 6 Months After it Fell in a Lake - Sakshi

ప్రస్తుతం మనం వాడుతున్న సాధారణ మొబైల్స్ ఒక్కసారి నీటిలో పడితే ఇక వాటి పని అంతే. ఇప్పుడు వస్తున్న కొత్త మొబైల్స్ లో వాటర్ రెసిస్టెంట్ ఉండటం వల్ల కొద్దిసేపు నీటిలో పడ్డ ఏమి కావు. కానీ, ఖరీదైన ఆపిల్ ఐఫోన్‌లలో ఐపి68 వాటర్ రెసిస్టెంట్ ఉండటం వల్ల రెండు మీటర్ల లోతులో 30 నిమిషాల వరకు ఉన్న కూడా పనిచేస్తాయని ఆపిల్ పేర్కొంది. కానీ, ఇటీవల ఒక ఐఫోన్ 11 మాత్రం నీటిలో పడ్డ ఆరు నెలల తర్వాత తీసిన కూడా పనిచేయడం విశేషం.

ఆపిల్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం.. ఇద్దరు వాటర్ డైవింగ్ నిపుణులు క్లేటన్ హెల్కెన్‌బర్గ్, అతని భార్య హీథర్ హారిసన్ బ్రిటిష్ కొలంబియాలోని హారిసన్ సరస్సులో రెండు ఫోన్‌లను గుర్తించారు. వీరు క్రమం తప్ప కుండా సరస్సు అడుగు భాగాన దొరికిన వస్తువులను వీడియో షూట్ చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేస్తుంటారు. ఒక రోజు వారు హారిసన్ సరస్సులో దొరికిన వస్తువులను షూట్ చేసున్న సమయంలో వారికీ ఒక ఒక ఫ్లిప్ ఫోన్, మరొక ఐఫోన్ 11 దొరికింది. ఇంటికి వెళ్లి వాటిని పరీక్షించినప్పుడు ఫ్లిప్ ఫోన్ పనిచేయనప్పటికీ ఐఫోన్ 11 మాత్రమే బాగానే పనిచేసింది. 

అయితే, ఈ ఐఫోన్ 11 నిజమైన యజమాని వాంకోవర్ నివాసి ఫాతేమె ఘోడ్సీని వారు సంప్రదించినప్పుడు అతను 2020 సెప్టెంబరులో నీటిలో పడిపోయినట్లు తాను పేర్కొంది. ఫోన్ నీటిలో పడిపోయి నప్పుడు తనకు ఏమి చేయాలో అర్ధం కాలేదు అని పేర్కొంది. కానీ, ఆరు నెలల తర్వాత హారిసన్ సరస్సులో కోల్పోయిన మీ ఐఫోన్ 11 నుంచి ఫోన్ దొరికిందని ఒకరి నుండి ఒక సందేశం వచ్చినప్పుడు ఫతేమె ఘోడ్సీకి మొదట అనుమానం వచ్చింది. వారు మిత్రులలో ఎవరైనా అట పట్టిస్తున్నారని భావించింది. కానీ తర్వాత నమ్మకం కలిగి వారు దగ్గరికి వెళ్లి ఫోన్ తీసుకుంది. అప్పుడు కూడా ఐఫోన్ 11 పని చేసినట్లు పేర్కొంది.

చదవండి:
రెండు సెకన్లకు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌!

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top