సుఖం కోసం కష్టమెందుకు?: టిక్​టాకర్​ ఖబి

Internet Celebrity Khaby Lame Popular with Life Hacks Satire - Sakshi

ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మనిషి.. పరిష్కారం కోసం షార్ట్​కట్​ను ఆశ్రయిస్తాడు. కానీ, ఆ షార్ట్​కట్​ కోసం ప్రయత్నించే క్రమంలోనే ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది!. అలా కష్టపడేవాళ్లను చూసి జాలిపడే కుర్రాడే ఖబి లామె. ఫేస్​బుక్​లో ఎక్కడో ఒక దగ్గర మీమ్​గా​, కామెంట్ సెక్షన్​లో ఫొటోగా కనిపించి నవ్వులు పూయించే ఖబి.. ఇప్పుడు ఇంటర్నెట్​ సెలబ్రిటీగా వరల్డ్ ఫేమస్​ అయ్యాడు. 

ఖబి లామె.. పాపులర్​​ టిక్​టాకర్​. ఎటువంటి ఎక్స్​ప్రెషన్స్​ ఇవ్వకుండా తన చేష్టలతోనే నవ్వించే వ్యక్తి. ఇటలీకి చెందిన ఈ 21 ఏళ్ల కుర్రాడి దృష్టిలో లైఫ్​ హ్యాక్స్​ అంటే పనికిరాని విషయం. రోజూవారీ పనుల్లో అవాంతరాలు ఎదురైనప్పుడు టిప్స్​ లాగా లైఫ్​ హ్యాక్స్​(మన దగ్గర జుగాద్​) పనికొస్తాయంటారు. అయితే వాటివల్ల తాత్కాలిక ఉపశనమే ఉంటుందని, అవి అనవసరమైనవని అతని ఉద్దేశం. సుఖం కోసం కష్టపడడం ఎందుకు? మామూలు ప్రయత్నాలు ఉంటాయి కదా అంటాడతను.

కారులో టీషర్ట్ ఇరుక్కుపోతే దానిని కత్తెరతో కట్​ చేయాలని వ్యూయర్స్​కి సలహా ఇచ్చే లైఫ్​ హ్యాకర్స్​.. సింపుల్​గా డోర్​ తీస్కోమని  చెప్పొచ్చు కదా అని అతని స్టైల్​లో అడుగుతున్నాడు ఖబి. టిక్​టాక్​లోనే కాదు.. అది బ్యాన్​ ఉన్న మనలాంటి దేశంలో అభిమానులకు నవ్వులు పంచేందుకు ఇన్​స్టాగ్రామ్​లోనూ వీడియోలు అప్​లోడ్ చేస్తుంటాడు ఖబి.

ఖబీ పుట్టి వెస్ట్ ఆఫ్రికాలోని సెనెగల్​లో. పెరిగింది మాత్రం ఇటలీలోని చివాస్సో. చదువుతోంది గ్రాడ్యుయేషన్​. వీడియో గేమర్​గా సంపాదిస్తున్నాడు కూడా. ఏడాది క్రితం వరకు ఇతను ఒక మామూలు వ్యక్తి. లాక్​డౌన్​తో టిక్​టాక్​లో అడుగుపెట్టాడు. ఇప్పుడు ఇతను ఒక ఈ-సెలబ్రిటీ.  టిక్​టాక్​లో ఐదున్నర కోట్లకు పైనే ఫాలోవర్స్​ ఉన్నారు.

ఇక ఇన్​స్టాగ్రామ్​లో కోటి 70 లక్షలకుపైనే ఫాలోయింగ్ ఉంది. వీడియోలో అతని హావభావాలే అతన్ని వైరల్ సెలబ్రిటీని చేశాయి. బెస్ట్ ఫ్రెండ్ జైరా నక్కీతో ఖబి రిలేషన్​లో ఉన్నట్లు తెలుస్తోంది.  ఇక గ్రాడ్యుయేషన్​ పూర్తి చేసిన ఖబి మంచి మనసున్నోడు కూడా. సోషల్ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్​గా సంపాదించే దాంట్లో సగం సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నాడు అతను.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top