వారిని విడుదల చేయండి!

Indian diaspora and citizens demand unconditional withdrawal of all charges against 18 activists in India - Sakshi

న్యూయార్క్‌: సీఏఏ ఆందోళనల్లో అరెస్టైన 18మంది విద్యార్ధులను బేషరతుగా విడుదల చేయాలని ప్రవాస భారతీయ ప్రముఖులు కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రిపబ్లిక్‌డే సందర్భంగా బుధవారం వీరంతా ఒక ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీ 18 విద్యార్ధులను అక్రమంగా నిర్భంధించారని, వీరిపై అన్ని కేసులను పూర్తిగా ఉపసంహరించాలని ప్రకటనలో కోరారు. ఈ 18మందిలో షర్జీల్‌ ఇమామ్‌ సహా 13మంది ముస్లింలున్నారు. ప్రకటనకర్తల్లో ఆస్ట్రేలియాలో ఎంపీగా ఎన్నికైన డేవిడ్‌ షోబ్రిడ్జి, ఆమ్నెస్టీకి చెందిన గోవింద్‌ ఆచార్య సహా పలు దేశాలకు చెందిన హక్కుల గ్రూపులు హిందూస్‌ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్, భారతీయ ముస్లింల అంతర్జాతీయ సమాఖ్య, దలిత్‌ సొలిడిటరీ ఫోరమ్‌ తదితరాలున్నాయి. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top