విమానానికి భారీ కుదుపులు..

Hawaiian Airlines Flight Hits Severe Turbulence, Dozens Injured - Sakshi

11 మందికి తీవ్ర గాయాలు

హొనొలులు: సెలవుల్లో సరదాగా గడపాలని బయలుదేరిన వారికి చేదు అనుభవం ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న విమానం భారీ కుదుపులకు లోనై 36 మంది గాయాలపాలయ్యారు. వీరిలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అమెరికాలో ఆదివారం చోటుచేసుకుంది.

అరిజోనా రాష్ట్రం ఫోనిక్స్‌ నుంచి హవాయిలోని హొనొలులుకు బయల్దేరిన హవాయి ఎయిర్‌లైన్స్‌ విమానం అరగంటలో ల్యాండవుతుందనగా భారీ కుదుపులకు లోనైంది. ఆ తాకిడికి ప్రయాణికులు గాల్లోకి ఎగిరిపడ్డారు. పైనున్న లగేజీ క్యాబిన్‌కు గుద్దుకున్నారు. వాటర్‌ బాటిళ్లు, సెల్‌ఫోన్లు చెల్లా చెదురుగా పడిపోయాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top