పార్లమెంట్ సభ్యుల ఈమెయిల్ ఖాతాలపై సైబర్ దాడి..! | Hackers Breached Several MP Email Accounts Poland Says | Sakshi
Sakshi News home page

Poland: పార్లమెంట్ సభ్యుల ఈమెయిల్ ఖాతాలపై సైబర్ దాడి..!

Jul 3 2021 1:17 PM | Updated on Jul 3 2021 3:16 PM

Hackers Breached Several MP Email Accounts Poland Says - Sakshi

వార్సా: పోలాండ్ పై భారీఎత్తున సైబర్ దాడి జరిగింది. ఏకంగా పార్లమెంట్ సభ్యుల ఈ మెయిల్ ఖాతాలు హ్యాకింగ్ కు గురయ్యాయి. సుమారు పన్నెండు మంది ఎంపీల ఈమెయిల్ ఖాతాలపై హ్యాకర్లు విరుచుకుపడ్డారు. ఎంపీల ఖాతాలు హ్యాకింగ్ కు గురైనట్లు పోలాండ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్ధారించారు..

హ్యాకింగ్ కు గురైన వారి ఖాతాలో ఆ దేశ ప్రధానమంత్రి ముఖ్య సలహాదారు మిచల్ దోర్జిక్ ఖాతా కూడా వుంది. పోలాండ్ కు సంబందించిన రహస్య పత్రాలను హ్యాకర్లు తస్కరించరని ఇంటెలిజెన్స్ ఆధికారులు తెలిపారు. యూఎన్సీ 1151 అని పిలవబడే హ్యాకర్లు దాడి చేశారని పోలాండ్ ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement