10 మంది శాస్త్రవేత్తల అదృశ్యం | Donald Trump was briefed on the deaths and disappearances of key scientists | Sakshi
Sakshi News home page

10 మంది శాస్త్రవేత్తల అదృశ్యం

Apr 19 2026 6:38 AM | Updated on Apr 19 2026 6:38 AM

Donald Trump was briefed on the deaths and disappearances of key scientists

విచారణకు ఆదేశించిన ట్రంప్‌ 

వాషింగ్టన్‌: అమెరికా ప్రభుత్వ అత్యంత కీలకమైన సమాచారం తెల్సిన కనీసం 10 మంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు అదృశ్యం కావడం లేక మరణించడంపై తక్షణమే దర్యాప్తు చేపట్టాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశించారు. ఇది చాలా తీవ్రమైన విషయమని వ్యాఖ్యానించారు. అమెరికా ఏరోస్పేస్, రక్షణ, గ్రహాంతర జీవులకు 
సంబంధించిన విషయాలు వీరికి సమగ్రంగా తెల్సునని చెబుతున్నారు.

 ట్రంప్‌ ఉత్తర్వుల నేపథ్యంలో మరో వారం పదిరోజుల్లో వీరికి సంబంధించిన పూర్తి సమాచారం వెలుగులోకి వస్తుందని భావిస్తున్నారు. శాస్త్రవేత్తలు, పరిశోధకుల అదృశ్యంపై హౌస్‌ ఓవర్‌సైట్‌ కమిటీలోని కాంగ్రెస్‌ సభ్యుడు ఎరిక్‌ బర్లిసన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వీటి వెనుక రష్యా, చైనా, ఇరాన్‌ల హస్తం ఉండేందుకు అవకాశాలు లేకపోలేదన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement