రెబల్స్‌తో పోరు.. చాద్‌ అధ్యక్షుడి దారుణ హత్య

Chad President Assassinated In Clash With Rebels - Sakshi

ఎండ్జమీనా: మధ్య ఆఫ్రికా దేశం చాద్‌ను మూడు దశబ్దాల పాటు పరిపాలించిన అధ్యక్షుడు ఇద్రిస్‌ దెబీ ఇత్నో మంగళవారం హత్యకు గురయ్యారు. ఈ విషయాన్ని ఆ దేశ ఆర్మీ వెల్లడించింది. రెబల్స్‌తో పోరు సందర్భంగా యుద్ధభూమిలో ఆయన మరణించినట్లు తెలిపింది. ఏప్రిల్‌ 11న చాద్‌లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఆయన గెలుపొందినట్లు ప్రకటన వచ్చిన కొద్ది గంటల్లోనే ఆయన హత్యకు గురి కావడం గమనార్హం.

ఈ నేపథ్యంలో, 18 నెలల ట్రాన్సిషనల్‌ కౌన్సిల్‌ను ఆయన కుమారుడైన మహమత్‌ ఇద్రిస్‌ ఇత్మో (37) నడిపిస్తారని ఆర్మీ ప్రకటించింది. అధ్యక్షుడి మరణానికి కారణమైన రెబల్స్‌ పక్క దేశమైన లిబియాలో శిక్షణ తీసుకొని వచ్చినట్లు ఆర్మీ భావిస్తోంది. ఎన్నికలు జరిగిన 11నే వారు ఉత్తర చాద్‌లోకి అడుగు పెట్టినట్లు అభిప్రాయపడుతోంది. ఇద్రిస్‌ దెబీ 1990లో గద్దెనెక్కారు. అప్పటి నుంచి చాద్‌ను పాలిస్తున్నారు.

చదవండి: రష్యా సర్జికల్‌ స్ట్రైక్:‌ 200 ఉగ్రవాదులు ఖతం 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top