గాలి ద్వారా కరోనా వ్యాప్తి: సీడీసీ

CDC Revises Guidance Says Covid 19 Can Spread Lingering In Air - Sakshi

వాషింగ్టన్‌: గాలిలో ఉన్న కరోనా వైరస్‌ నాలుగ్గంటల తర్వాత కూడా వ్యాప్తి చెందవచ్చునని యూఎస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) తెలిపింది. వెలుతురు తక్కువ వున్న ప్రాంతంలో ఆరడుగులకుపైగా దూరం పాటించినప్పటికీ కరోనా ఇతరులకు వ్యాప్తి చెందినట్లు ఆధారాలున్నాయని సీడీసీ తెలిపింది.

కరోనా సోకిన వారి నుంచి వెలువడే నీటి తుంపర్లు, రేణువులు, పొగమాదిరిగా గాలిలో కలిసి ఉండి, భూమిమీద పడతాయని అందుకే ఆరడుగుల సామాజిక దూరం నియమం పెట్టారని సీడీసీ తెలిపింది. తుంపర్లలో ఉన్న వైరస్‌ కొన్ని సెకన్ల నుంచి, గంటల వరకు గాలిలో ఉంటుందని, రెండు మీటర్లకు దూరం వరకు ప్రయాణం చేయగలుగుతుందని, తక్కువ వెలుతురు ఉన్న చోట గాలి ద్వారా ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతుందని తెలిపారు.  (కృష్ణబిల పరిశోధనలకు పట్టం)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top