Britain PM Race: Rishi Sunak Wins Second Round Of Voting In UK Leadership Contest - Sakshi
Sakshi News home page

బ్రిటన్‌ ప్రధాని రేసు.. రెండో రౌండ్‌లోనూ రిషి సునాక్‌ జోరు

Jul 14 2022 8:58 PM | Updated on Jul 15 2022 8:52 AM

Britain PM Race: Rishi Sunak Tops Second Round Of Voting - Sakshi

భారత సంతతికి చెందిన రిషి సునాక్‌.. కన్జర్వేటివ్‌ ఎంపీల రెండో బ్యాలెట్‌లో తొలి స్థానంలో నిలిచారు.

లండన్‌: బ్రిటన్‌ ప్రధాని రేసులో ఇవాళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బ్రిటన్‌ మాజీ ఆర్థిక మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ అత్యధిక ఓట్లతో రెండో దశ ఎన్నికలో ముందంజలో నిలిచారు. అదే సమయంలో.. భారత సంతతికే చెందిన సువెల్లా బ్రావర్మన్‌ తక్కువ ఓట్లతో పోటీ నుంచి ఎలిమినేట్‌ అయ్యారు. 

కన్జర్వేటివ్‌ పార్టీ నిర్వహించిన రెండో దశ ఎన్నికల్లో.. 101 ఓట్లతో రిషి సునాక్‌ ముందంజలో నిలిచారు. పెన్నీ మోర్డాంట్‌ 83 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఇక భారత సంతతికి చెందిన సువెల్లా బ్రావెర్మన్‌(అటార్నీ జనరల్‌) పోటీ నుంచి వైదొలిగారు. 

ప్రధాని రేసులో చాలామంది ఉండడంతో దశల వారీగా బ్యాలెట్‌ పోలింగ్‌ నిర్వహించి.. చివరికి ఒకరిని ఎన్నుకుంటారు. మెజార్టీ ఉన్న పార్టీ తరపున అభ్యర్థి కావడంతో కన్జర్వేటివ్‌ పార్టీ నుంచి చివరగా మిగిలిన వ్యక్తే ప్రధాని(బోరిస్‌ జాన్సన్‌ స్థానంలో) అవుతారు. అయితే ప్రధానిగా ఎన్నికైన వ్యక్తి ఒకవేళ ఎన్నికలకు వెళ్లాలనుకుంటే.. వెళ్లొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement