వైరల్‌: అరటి గెల మీద పడటంతో కోర్టుకు.. ఐదేళ్లు పోరాడి విజయం.. రూ.4 కోట్ల నష్ట పరిహారం

Aussie Labourer Falls From BananaTree, Gets Rs 4 Cr Compensation - Sakshi

బెర్న్‌: ప్రమాదవశాత్తు సంస్థలో పనిచేసే కార్మికులకు గాయాలైతే లేదా చనిపోతే సదరు సంస్థే నష్టపరిహారం చెల్లిస్తుంది. ప్రమాద తీవ్రదతను బట్టి కొంత మొత్తాన్ని వారికి అప్పజెప్పుతుంది. అయితే తాజాగా ఓ అరటి తోటలో పనిచేసే కార్మికుడిపై అరటి చెట్టు పడటంతో యాజమానిపై దావా వేసి ఏకంగా 4 కోట్లు రాబట్టాడు. ఈ ఆశ్యర్యకర ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది.
చదవండి: Viral: కళ్లు పోతేనేం.. అతని పట్టుదలముందు ఏ కష్టమైనా దిగదుడుపే!

క్వీన్స్‌ల్యాండ్‌లో సమీపంలోని ఎల్ అండ్ ఆర్ కాలిన్స్‌కు చెందిన అరటి తోటలో జైర్ లాంగ్‌ బాటమ్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. కాపుకు వచ్చిన చెట్లనుంచి అరటి పండ్ల గెలలను నరుకుతుండగా ప్రమాదవశాత్తు అరిటి పండ్ల గెలతో పాటు అరటి చెట్టుకూడా అతనిపై పడింది. దాంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దెబ్బలు తీవ్రంగా తగలటంతో లాంగ్ బాటమ్ వికలాంగుడైపోయాడు. ప్రమాదం కారణంగా పనిచేయలేక ఉపాధి కోల్పోయాడు. దీంతో బాధితుడు తనకు పరిహారం కోరుతూ అరటితోట యజమానిపై క్వీన్స్‌ల్యాండ్‌ సుప్రీంకోర్టులో పిటీషన్ వేశాడు.  ఇది 2016లో జరిగింది.
చదవండి: డ్యాన్స్‌ ఇరగదీసిన వధువు.. అంతా ఫిదా, అయితే వరుడు మాత్రం..!

ఈ పిటీషన్‌పై కోర్టు విచారణ ఇప్పటి వరకు కొసాగింది. తాజాగా మరోసారి ఈ కేసుపై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా అరటి పండ్ల గెల మీద పడటం కారణంగానే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని, ఆ ఘటన వల్లనే అతను జీవితాంతం ఉపాధిని కోల్పోవాల్సి వచ్చిందని కోర్టు అభిప్రాయపడింది.. కాబట్టి ఆ కూలీకి యజమాని 502,740 డాలర్ల పరిహారాన్ని అంటే భారత కరెన్సీలో 3,77,15,630 రూపాయలను చెల్లించాలని అరటి తోట యజమానిని కోర్టు ఆదేశించింది. ఇలా క్వీన్స్‌లాండ్ సుప్రీంకోర్టు అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.  దీంతో చేసేందేంలేక సదరు యజమాని కూలీకి పూర్తి నష్టపరిహారం చెల్లించాడు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top