మణికొండ: తల్లి పక్కనే నిద్రిస్తున్న ఓ చిన్నారి..తల్లి నిద్రలేచే సరికిఇంటి ముందే ఉన్న నీటి సంపులో పడి మృతి చెందాడు. ఈ సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గండిపేటలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. మహారాష్ట్రకు చెందిన తేజస్ శ్రీకాంత్‌జాదవ్ తన తమ్ముడు, తల్లి, భార్య, 8 నెలల కుమారుడు సౌరబ్ జాదవ్‌తో కలిసి గండిపేట తహసీల్దార్ కార్యాలయం సమీపంలో నివాసముంటున్నారు. బుధవారం శంకర్, తల్లి ఉషతో కలిసి కూలీ పనికి వెల్లాడు. ఇంట్లో ఉన్న భార్య రాధిక.. కుమారుడితో కలిసి మధ్యాహ్నం ఇంట్లో నిద్రించింది. మధ్యాహ్నం 2గంటలకు శంకర్ ఇంటికి వచ్చి అన్నం పెట్టుకుంటుండటంతో శబ్దంతో నిద్ర మేల్కొన్న రాధిక.. కుమారుడు కనిపించకపోవటంతో చుట్టు పక్కల వెతికారు. ఇంటి ముందు నీటి సంప్ తెరచి ఉండటంతో అందులో చూడగా బాలుడు కనిపించాడు. వెంటనే బాలుడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.


