పాతకక్షలతో యువకుడిపై దాడి | - | Sakshi
Sakshi News home page

పాతకక్షలతో యువకుడిపై దాడి

Apr 3 2026 9:55 AM | Updated on Apr 3 2026 9:55 AM

మైలార్‌దేవ్‌పల్లి: పాతకక్షల నేపథ్యంలో ఓ యువకుడిపై ముగ్గురు కలిసి కత్తులు, గొడ్డలితో దాడిచేశారు. ఈ సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ తెలిపిన మేరకు.. శాసీ్త్రపురం అదీబా హోటల్‌ సమీపంలో మహ్మద్‌ ఫహాద్‌ (19) కార్మికుడిగా పని చేస్తూ నివాసం ఉంటున్నాడు. శాసీ్త్రపురం బీకేపురానికి చెందిన సయ్యద్‌ షాబాజ్‌తో ఫహాద్‌కు గొడవ జరిగి ఉంది. ఈ నేపఽఽథ్యంలో షాబాజ్‌ ఎలాగైనా ఫహాద్‌ను హత్య చేయాలని పథకం వేశాడు. ఈ విషయాన్ని తన స్నేహితులైన షానవాజ్‌ ఖాన్‌, రిజ్వాన్‌కు తెలిపాడు. గురువారం తెల్లవారుజామున అదీబా హోటల్‌ సమీపంలో మహ్మద్‌ ఫహద్‌ కోసం మాట వేసి ఉన్నారు. ఫహాద్‌ రాగానే అతడిపై కత్తితో పొడిచి, గొడ్డలితో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో బాధితుడి తల వెనుక భాగం భుజంపై గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితుడిని ఉస్మానియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. దాడికి ఉపయోగించిన గొడ్డలి, కత్తి, కొడవలిని స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

దాడికి పాల్పడ్డ నిందితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement