● రూ. 3.61 లక్షల విలువైన సరుకు స్వాధీనం
నాగోలు: డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఎల్‌బీనగర్ డీసీపీ డాక్టర్ అనురాధ తెలిపిన మేరకు.. టోలిచౌకి చెందిన జునైద్ రజా సిద్ధిఖీ(36), కోల్‌కతాకు చెందిన సునీల్ సుబ్బ అలియస్ జానీ(29)లు స్నేహతులు. వీరికి సన్‌సిటీకి చెందిన అన్నారీకి డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ అన్నారీకి సహాయం చేస్తూ డ్రగ్స్ విక్రయించేవారు. బుధవారం సాయంత్రం నాగోలు చౌరస్తాలో ఈ ఇద్దరూ అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. సమాచారం అందుకున్న ఎల్‌బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు, నాగోలు పోలీసులు ఇద్దరినీ అందుపులోకి తీసుకుని వారి ద్విచక్రవాహనాన్ని తనిఖీ చేయగా 25.65 గ్రాముల నిషేధిత ఎండిఎంఏ డ్రగ్‌ను వారిని నుండి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.


