లక్డికాపూల్ : మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్‌లో శుక్రవారం జరగాల్సిన సీఎం ప్రజావాణి కార్యక్రమం 7వ తేదీకి వాయిదా పడింది. గుడ్ ఫ్రైడే సందర్భంగా సీఎం ప్రజావాణి నిర్వహించడం లేదని దరఖాస్తుదారులు ఈ మార్పును గమనించి ఏడవ తేదీ మంగళవారం ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ ఒక ప్రకటనలో తెలిపారు
‘ఆటిజం’పై తల్లిదండ్రుల్లో అవగాహన పెంచాలి
● స్పెషల్ చీఫ్ సెక్రటరి జయేష్ రంజన్
బంజారాహిల్స్: ఆటిజం ఉన్న చిన్నారులను ప్రాథమిక స్థాయిలోనే తల్లిదండ్రులు గుర్తించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర స్పెషల్ చీఫ్‌సెక్రటరీ జయేష్ రంజన్ అన్నారు. బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు జీహెచ్‌ఎంసీ వాక్‌వేలో స్వచ్ఛంద సంస్థలు, జీహెచ్‌ఎంసీ కలిసి.. ఆటిజం చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన కమ్యూనికేషన్ బోర్డును ఆయన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌తో కలిసి ప్రారంభించారు. జయేష్ రంజన్ మాట్లాడుతూ.. ఆటిజం చిన్నారులకు అర్థమయ్యేవిధంగా కమ్యూనికేషన్ బోర్డులను పర్యాటక ప్రాంతాలు, పార్కులు, మాల్స్, బహిరంగ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. గ్రేటర్ కమిషనర్ కర్ణన్, కోర్ కిడ్స్ ఫౌండర్స్ డాక్టర్ నవీన, డాక్టర్ ప్రతిమ తదితరులు పాల్గొన్నారు.
● ట్యాంక్‌బండ్ శివ దంపతులనుసన్మానించిన జిల్లా కలెక్టర్
సాక్షి, సిటీబ్యూరో: ట్యాంక్ బండ్ శివ సేవా దక్పథం స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో శివ దంపతులు మర్యాదపూర్వకంగా కలెక్టర్‌ను కలిశారు.ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పురుషులు, మహిళలు , వృద్ధులు, దాదాపు 140 మందికి పైగా ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లిన వారిని కాపాడామని.. వారికి జీవిత విలువను చెబుతున్నామని వివరించారు. పలువురి మృతదేహాలు కూడా వెలికితీసి కుటుంబ సభ్యులకు అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారిని సత్కరించారు.


