నిబంధనలకు విరుద్ధంగా బైక్‌పై ప్రయాణం
లక్డీకాపూల్: ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించి అత్యంత ప్రమాదకర రీతిలో ఒకే బైక్‌పై ఐదుగురు ప్రయాణించిన ఘటనలో ఐదుగురు యువకులను సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా పోలీసులు ఈ చర్య తీసుకున్నట్లు సైఫాబాద్ ఎస్‌హెచ్‌ఓ సీతయ్య తెలిపారు. గత నెల 29 అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ జంక్షన్ నుంచి సెక్రటేరియట్ వైపు పల్సర్ బైక్‌పై ఐదుగురు వ్యక్తులు అత్యంత నిర్లక్ష్యంగా ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయింది. దీంతో వడ్డీ అర్జున్, అరుపు రోహిత్, చింతకుంట అంజన్ కుమార్, సిద్ధం కౌశిక్, వల్లపు మురళిలపై పోలీసులు కేసు నమోదు చేశారు.


