జయేష్ రంజన్
బంజారాహిల్స్: కేబీఆర్ పార్కు ఫ్లైఓవర్ పనులు మరింత వేగిరం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక అధికారి జయేష్ రంజన్ ఆదేశించారు. ఎల్వీ ప్రసాద్ ఐ ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, రోడ్డునెంబర్–45 వరకు క్షేత్రస్థాయిలో ఫ్లైఓవర్ పనుల పురోగతిని జయేష్ రంజన్ జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, చీఫ్ ఇంజినీర్ సహదేవ్ రత్నాకర్ గురువారం పరిశీలించారు. ప్రతి వారం పనుల పురోగతిని సమీక్షించాలన్నారు. ఎంఈఐఎల్ (మేఘా) సంస్థ అదనంగా మెషిన్, మ్యాన్‌పవర్‌ను సమకూర్చుకోవాలని ఆదేశించారు.


