రామ్ లక్ష్మణ్ జానకి.. జై బోలో హనుమాన్‌కీ.. జై.. జై వీరమాన్.. జై బజరంగ్ దళ్.. నినాదాలతో వీధులన్నీ మార్మోగాయి. కాషాయ జెండాలతో కళకళలాడాయి. గురువారం బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో చేపట్టిన వీర హనుమాన్ విజయయాత్ర కన్నుల పండువగా సాగింది. గౌలిగూడ రామమందిర్ నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. కోఠి ఆంధ్రా బ్యాంక్ చౌరస్తాలో వేలాది మంది భక్తులు సామూహిక హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు. కోఠి ఉమెన్స్ కాలేజ్ చౌరస్తా, సుల్తాన్‌బజార్ చౌరస్తా, రామ్‌కోఠి, కాచిగూడ క్రాస్‌రోడ్, నారాయణగూడ క్రాస్‌రోడ్, అశోక్‌నగర్, బైబిల్ హౌస్, ప్యారడైజ్ మీదుగా తాడ్‌బండ్ హనుమాన్ దేవాలయానికి శోభాయాత్ర చేరుకుంది. గౌలిగూడ రాంమందిర్‌లో పోలీస్ కమిషనర్ సజ్జనార్ పూజలు చేశారు.
– సుల్తాన్‌బజార్/అఫ్జల్‌గంజ్


