విజయనగర్‌కాలనీ: అనుమతులు లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో బేకరీ ఉత్పత్తులను తయారు చేస్తున్న ఓ కేంద్రంపై టప్పాచబుత్ర పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం దాడి చేశారు. ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ తెలిపిన మేరకు.. సయ్యద్ ఖదీర్ జిర్రాలో చాంద్ బేకరీ నిర్వహిస్తున్నాడు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ..... అపరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేస్తున్న బేకరి ఉత్పత్తులు రూ.2.77 లక్షల విలువైనవి స్వాధీనం చేసుకున్నారు. దాడిలో గోల్కొండ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఆర్.వెంకటేష్, ఎస్‌ఐలు అమ్జద్ షరీఫ్, కె.వెంకటరమణ పాల్గొన్నారు.


