చాంద్రాయణగుట్ట: జీవితాంతం కలిసి ఉంటానంటూ అగ్నిసాక్షిగా ఏడడుగులు వేసిన ఆ ఇల్లాలు భర్త చితికి తలకొరివి పెట్టింది. పాతబస్తీ అలియాబాద్‌కు చెందిన పోకాల్కర్ ప్రకాష్ రాజు గుండెపోటుతో మృతి చెందారు. వారికి నలుగురు కుమార్తెలు. వారికి వివాహాలు కూడా పూర్తయ్యాయి. కుమారులు లేకపోవడంతో నల్లవాగు హిందూ శ్మశాన వాటికలో భార్య పద్మ గురువారం భర్త అంత్యక్రియల ప్రక్రియ నిర్వహించింది.
శంషాబాద్‌లోపేలిన సిలిండర్లు
శంషాబాద్: శంషాబాద్ సర్కిల్‌లోని సాయినగర్ కాలనీలో కార్మికులు నివాసముంటున్న రేకుల గదుల్లోని మూడు సిలిండర్లు పేలి భారీ ఎత్తున మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. గురువారం కార్మికులంతా రోజువారీలాగే పనులకు వెళ్లారు. మధ్యాహ్నం ఎండవేడిమికి నిప్పంటుకుని ఓ గదిలో సిలిండర్ పేలింది. దాని ప్రభావం పక్కనే ఉన్న గదుల్లోని సిలిండర్లకు వ్యాపించడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. ఆర్‌జీఐఏ పోలీసులు ఫైరింజన్ రప్పించి మంటలు ఆర్పివేయించారు.


