నిరుద్యోగులను పట్టించుకోని రేవంత్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులను పట్టించుకోని రేవంత్‌రెడ్డి

Feb 27 2026 10:48 AM | Updated on Feb 27 2026 10:48 AM

నిరుద్యోగులను పట్టించుకోని రేవంత్‌రెడ్డి

నిరుద్యోగులను పట్టించుకోని రేవంత్‌రెడ్డి

ఖైరతాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిరుద్యోగుల కృషితో ముఖ్యమంత్రి అయి ఇప్పుడు నిరుద్యోగులను మర్చిపోయారని రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. గురువారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ముందు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డీఎస్పీ, 40వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తా నిరుద్యోగం లేకుండా చేస్తా అని చెప్పారు.. కానీ ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకున్నారని, ఎంతో మంది జీవితాలు దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్లిపోయానన్నారు. ప్రభుత్వం వెంటనే ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగులు డీఎస్సీ వేసే వరకు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ర్యాగ అరుణ్‌కుమార్‌, నీల వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement