త్వరలో అంబేడ్కర్‌ టవర్‌ నిర్మాణం | - | Sakshi
Sakshi News home page

త్వరలో అంబేడ్కర్‌ టవర్‌ నిర్మాణం

Feb 27 2026 10:48 AM | Updated on Feb 27 2026 10:48 AM

త్వరలో అంబేడ్కర్‌ టవర్‌ నిర్మాణం

త్వరలో అంబేడ్కర్‌ టవర్‌ నిర్మాణం

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

కవాడిగూడ: లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ భవనం స్థానంలో భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడే విధంగా అంబేడ్కర్‌ టవర్‌ నిర్మిస్తామని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అంబేడ్కర్‌ టవర్‌ నిర్మిస్తామని నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి వదిలేశారని ఆరోపించారు. గురువారం లోయర్‌ ట్యాంక్‌ బండ్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ భవనాన్ని వివిధ దళిత సంఘాల విజ్ఞప్తి మేరకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుతోపాటు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... వీలైనంత త్వరగా అంబేడ్కర్‌ టవర్‌ను నిర్మించే బాధ్యత సాంఘిక సంక్షేమ మంత్రిగా తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. అంబేడ్కర్‌ టవర్‌ నిర్మాణంలో అన్ని వర్గాల ప్రజలు దళిత సంఘాలు భాగస్వాములై పూర్తి స్థాయిలో సహకరించలని మంత్రి కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement