రాష్ట్రం నుంచి ఇద్దరు,ముగ్గురు ఒలింపియన్లు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రం నుంచి ఇద్దరు,ముగ్గురు ఒలింపియన్లు

Feb 27 2026 10:48 AM | Updated on Feb 27 2026 10:48 AM

రాష్ట్రం నుంచి ఇద్దరు,ముగ్గురు ఒలింపియన్లు

రాష్ట్రం నుంచి ఇద్దరు,ముగ్గురు ఒలింపియన్లు

బంజారాహిల్స్‌: తెలంగాణ రైఫిల్‌ అసోసియేషన్‌ (టీఆర్‌ఏ) ఆధ్వర్యంలో దేశంలో తొలిసారిగా నిర్వహించిన స్పోర్ట్స్‌ షూటింగ్‌ లీడర్‌షిప్‌ కాన్‌క్లేవ్‌–2026 విజయవంతంగా ముగిసింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–12లోని టీఆర్‌ఏ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. మాజీ ఎంపీ, క్రీడా సలహాదారు జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ... 2032 నాటికి తెలంగాణ నుంచి కనీసం ఇద్దరు, ముగ్గురు ఒలింపియన్లు తయారుచేయగలమనే విశ్వాసం వ్యక్తం చేశారు. నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) అధ్యక్షుడు కాలికేష్‌ నారాయణ్‌సింగ్‌ మాట్లాడుతూ... మౌలిక వసతుల మెరుగుదల, శాసీ్త్రయ కోచింగ్‌, ఏఐ ఆధారిత విశ్లేషణపై దృష్టి పెట్టాలని సూచించారు. టీఆర్‌ఏ అధ్యక్షుడు అమిత్‌ సంఘి మట్లాడుతూ.. షూటింగ్‌ క్రీడ ప్రశాంతంగా కనిపించినా అత్యధిక ఒత్తిడి, క్రమశిక్షణ, ఏకాగ్రత అవసరమయ్యే క్రీడ అని పేర్కొన్నారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ రమేష్‌, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ హరిచందన దాసరి, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ డైరెక్టర్‌, ఎండీ సోనిబాలదేవి తదితర ప్రముఖులు హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement