ఒక్కొక్కరిపై ఒక్కోలా.. ఏఐ ప్రభావం | - | Sakshi
Sakshi News home page

ఒక్కొక్కరిపై ఒక్కోలా.. ఏఐ ప్రభావం

Feb 27 2026 10:48 AM | Updated on Feb 27 2026 10:48 AM

ఒక్కొక్కరిపై ఒక్కోలా.. ఏఐ ప్రభావం

ఒక్కొక్కరిపై ఒక్కోలా.. ఏఐ ప్రభావం

ఖైరతాబాద్‌: భవిష్యత్తులో ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ప్రభావం ప్రతి ఒక్కరిపై వేర్వేరుగా ఉంటుందని, అందుకు అనుగుణంగా విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని టీఆర్‌అండ్‌బీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వికాస్‌రాజ్‌ అన్నారు. గురువారం ది ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ తెలంగాణ స్టేట్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌ విశ్వేశ్వరయ్య భవన్‌లో క్యాంపస్‌ టు కేపబిలిటీ కాన్‌క్లేవ్‌–2026 పేరుతో రక్షణ, ఏరోస్పేస్‌లో విద్య, పరిశ్రమల మధ్య అంతరాన్ని ఎలా తగ్గించాలనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వికాస్‌ రాజ్‌ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ తమ నైపుణ్యంతో సమాజానికి ఎలా ఉపయోగపడగలమనే విధంగా ఆలోచించాలన్నారు. మిధాని సీఎండీ ఎస్‌వీఎస్‌.నారాయణ మూర్తి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ బాలకృష్టారెడ్డి, ఐఈఐ చైర్మన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రమణానాయక్‌, గౌరవ కార్యదర్శి మర్రి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement