కార్గోలో ఇన్నొవేటివ్‌ ఎయిర్‌పోర్టుగా ఆర్‌జీఐఏకు అవార్డు | - | Sakshi
Sakshi News home page

కార్గోలో ఇన్నొవేటివ్‌ ఎయిర్‌పోర్టుగా ఆర్‌జీఐఏకు అవార్డు

Feb 27 2026 10:48 AM | Updated on Feb 27 2026 10:48 AM

కార్గోలో ఇన్నొవేటివ్‌ ఎయిర్‌పోర్టుగా ఆర్‌జీఐఏకు అవార్డు

కార్గోలో ఇన్నొవేటివ్‌ ఎయిర్‌పోర్టుగా ఆర్‌జీఐఏకు అవార్డు

శంషాబాద్‌: ఎయిర్‌ కార్గో ఇండియా విభాగంలో రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కార్గో విభాగానికి ఇన్నోవేటివ్‌ ఎయిర్‌పోర్టుగా అవార్డు దక్కినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. షిప్పింగ్‌ ట్రాన్స్‌పోర్టు ఎవియేషన్‌ ట్రేడ్‌ (ఎస్‌టీఏటీ) పబ్లిషింగ్‌ సంస్థ ఆధ్వర్యంలో ఈ అవార్డు దక్కిందని తెలిపారు. ఎయిర్‌ కార్గోలో జీఎంఆర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అనేక మైలురాళ్లు దాటిందన్నారు. దేశంలో మొదటి సారిగా ఎయిర్‌సైడ్‌ టెంపరేచర్‌ కంట్రోల్‌ రిఫర్‌ ట్రక్‌, అన్‌ బ్రోకెన్‌ కోల్డ్‌ చైన్‌, ఫ్లైట్‌ ఇన్‌పర్మేషన్‌ డిస్‌ప్లే కేంద్రం, త్వరిత గతిన రక్షణ చర్యలు సంబంధిత అంశాల్లో జీఎంఆర్‌ కార్గో అందిస్తున్న సేవలకుగాను ఈ గుర్తింపు దక్కిందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement