బుద్ధం శరణం గచ్ఛామి! | - | Sakshi
Sakshi News home page

బుద్ధం శరణం గచ్ఛామి!

Feb 19 2026 11:02 AM | Updated on Feb 19 2026 11:02 AM

బుద్ధం శరణం గచ్ఛామి!

బుద్ధం శరణం గచ్ఛామి!

ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ థాయ్‌లాండ్‌తో పాటు భారత్‌కు చెందిన బౌద్ధ భిక్షువులు చేపట్టిన చరిత్రాత్మక మూడో దమ్మ పాదయాత్ర బుధవారం నగరంలోని ఐమ్యాక్‌ సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహం వరకు చేరుకుంది. బుద్ధుడు బోధించిన శాంతి, కరుణ సందేశాలను చాటిచెప్పే లక్ష్యంతో సాగుతున్న ఈ పాదయాత్ర కర్ణాటకలోని సిద్ధార్థ బుద్ధ విహార్‌ నుంచి ప్రారంభమైంది. మార్చి 1న నాగార్జున సాగర్‌లోని బుద్ధ వనాన్ని చేరుకుంటుంది. ఈ సందర్భంగా బౌద్ధ భిక్షువులు అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం హుస్సేన్‌ సాగర్‌లోని బుద్ధుడి విగ్రహాన్ని సందర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement