గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

Published Fri, May 24 2024 1:50 PM

గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

77 సెంటర్ల ఏర్పాటు హాజరుకానున్న 40,569 అభ్యర్థులు

కలెక్టరేట్‌ లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి

సాక్షి,సిటీబ్యూరో: టీఎస్‌ పీఎస్‌సీ గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి సంబంధిత అధికారులను ఆదేశించారు. జూన్‌ 9న జరగనున్న పరీక్ష నిర్వహణ ఏర్పాట్ల పై రీజినల్‌ కోఆర్డినేటర్స్‌, పోలీస్‌ నోడల్‌ ఆఫీసర్స్‌, సూపరింటెండెంట్లు, జిల్లా అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పరీక్షను ఎంతో జాగ్రతగా, పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ప్రిలిమినరీ పరీక్షకు హైదరాబాద్‌ జిల్లా నుండి 40,569 మంది అభ్యర్థులు పరీక్ష హాజరు కానుండటంతో 77 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష నిర్వహణకు 11 మంది రూట్‌ ఆఫీసర్లు ఐదుగురు రీజినల్‌ కోఆర్డినేటర్లు,77 మంది మెంటార్‌ అధికారులు, 16 ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభ్యర్థుల బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌ క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్‌ వస్తువులకు అనుమతి లేదన్నారు. ఎగ్జామ్‌ క్యాంపస్‌ లోకి చీఫ్‌ సూపరింటెండెంట్‌ కు తప్ప ఎవరికి సెల్‌ ఫోన్‌ తీసుకెళ్లేందుకు అనుమతించవద్దని సూచించారు. డిపార్ట్‌మెంటల్‌ అధికారులు పరీక్ష పూర్తయ్యే వరకు కేంద్రం నుంచి బయటకు వెళ్లడానికి వీలు లేదన్నారు. దివ్యాంగులు అంధ అభ్యర్థుల కోసం స్కైబ్స్‌ను గుర్తింపు కార్డు చూసి అనుమతించాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత కేశవ్‌, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి, జాయింట్‌ కస్టోడియన్‌లు కే. వీరబ్రహ్మ చారి, టి. రవి, ఎం. సూర్యప్రకాష్‌, ఎస్‌. రాజేష్‌ కుమార్‌, బి. అపర్ణ,రీజినల్‌ కోఆర్డినేటర్లు డాక్టర్‌ ఎన్‌. చందన, డాక్టర్‌ లక్ష్మి శ్రీనివాసరెడ్డి, డాక్టర్‌ బి సత్యనారాయణ, డాక్టర్‌ ఏ కష్ణయ్య, డాక్టర్‌ రాజేందర్‌ నాయక్‌, డిపార్ట్‌మెంటల్‌ అధికారులు,ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌, సూపరింటెండెంట్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు

Advertisement
 
Advertisement
 
Advertisement