
హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని టీహబ్‌లో గురువారం నిర్వహించిన ఫ్యాషన్‌షో అదుర్స్ అనిపించింది. త్రీసీ (సృష్టించు, సహకరించు, జయించు) ఫెస్టివల్‌లో భాగంగా దీనిని తలపెట్టారు. ఈ సందర్భంగా 8 మంది మోడల్స్ ర్యాంప్‌పై హొయలొలికించారు. ప్రెట్ అండ్ ఇండో వెస్ట్రన్, ఎత్నిక్ బ్రైడల్ కలెక్షన్లు ఎస్‌జీ ఫ్యాషన్‌కి చెందిన శ్రీకాంత్ గట్ల ఈ షోను క్యూరేట్ చేశారు. మిస్ ఇండియా వరల్డ్–2020 మానస వారన్సి, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు ఫ్యాషన్ షోను తిలకించారు. డెనౌర్లెన్ స్టార్టప్ సీఓఓ సౌమ్యారావు, డెనౌర్లెన్ స్టార్టప్ సీఈఓ ఠాగూర్ సీనియర్, ఎండీ జూనియర్ ఠాగూర్, టీ హబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. – రాయదుర్గం