ప్రొబేషనరీ డీఎస్పీలకు సీపీ దిశానిర్దేశం
హసన్‌పర్తి: ప్రజలకు పోలీస్‌శాఖపై నమ్మకం, భరోసా కల్పించేలా ప్రతీ అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత సూచించారు. ఇటీవల నియామకాల్లో డీఎస్పీలుగా ఎంపికై 24 వారాల పాటు శిక్షణ కోసం వరంగల్ కమిషనరేట్‌కు వచ్చిన దారవత్ సబిత, పల్లేటి సాయి ప్రత్యూష్రెడ్డి, రుషిరెడ్డి, శంతన్కుమార్రెడ్డి, రావిరాల యశస్విని ప్రొబేషనరీ డీఎస్పీలు సోమవారం సీపీ శ్వేతను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా సీపీ వారికి పోలీస్‌శాఖ పనితీరు, విధులు నిర్వహణపై పలు సూచనలిచ్చారు.


