కేటీఆర్‌.. దమ్ముంటే పశ్చిమలో పోటీచెయ్‌ | - | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌.. దమ్ముంటే పశ్చిమలో పోటీచెయ్‌

Nov 24 2026 1:12 AM | Updated on Nov 24 2026 1:12 AM

కేటీఆర్‌.. దమ్ముంటే పశ్చిమలో పోటీచెయ్‌

హన్మకొండ చౌరస్తా: అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మోసం చేయడం కాదు.. దమ్ముంటే వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంనంచి పోటీచేసి గత ప్రభుత్వ అభివృద్ధి ఏంటో నిరూపించుకోవాలని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు సవాల్‌ విసిరారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో సోమవారం డిజిటల్‌ స్క్రీన్‌పై గత ప్రభుత్వ వైఫల్యాలు ఇవీ అంటూ వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ వంద అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశారని, వందసార్లు ముక్కు నేలకు రాసినా ఆయనను ప్రజలు క్షమించే పరిస్థితిలో లేరని అన్నారు. మూడేళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిపై ఆధారాలతో నిరూపిస్తా, గాలిలో బాణాలు వేయకుండా హనుమకొండ చౌరస్తాలో చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. జిల్లాకు సరైన మంత్రి లేడన్న విలేకరుల ప్రశ్నకు తనకు 42 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని, మంత్రి పదవి ఇస్తానంటే ఎవరైనా వద్దంటారా? అని సమాధానం ఇచ్చారు. ఎంపీ కావ్య మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో అర్హులైన పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను అందించలేకపోయారని విమర్శించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు మాట్లాడుతూ వరంగల్‌ సభలో కేటీఆర్‌ మాట తీరు సినిమా షూటింగ్‌ను తలపించిందన్నారు. బీఆర్‌ఎస్‌ ఖాతాలో మరో గొర్రెను బలిచ్చారని ఎద్దేవా చేశారు. సమావేశంలో కుడా చైర్‌పర్సన్‌ గుండు సుధారాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అజీజ్‌ ఖాన్‌, మేరు కార్పొరేషన్‌ చైర్మన్‌ సంగ వెంకట్రాజం, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పులి ప్రియాంక, కాంగ్రెస్‌ నాయకులు డాక్టర్‌ పెరుమాండ్ల రామకృష్ణ, వీసం సురేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

గాలిలో బాణాలు కాదు.. అభివృద్ధిపై చర్చకు రావాలి

మంత్రి పదవి ఇస్తే ఎవరు వద్దంటారు

వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement