ఎంజీఎంలో వైద్యసేవలపై డీఎంఈ ఆరా | - | Sakshi
Sakshi News home page

ఎంజీఎంలో వైద్యసేవలపై డీఎంఈ ఆరా

Aug 28 2026 4:33 AM | Updated on Aug 28 2026 4:33 AM

ఎంజీఎంలో వైద్యసేవలపై డీఎంఈ ఆరా

అదనపు వైద్యులను నియమిస్తామని వెల్లడి

కాశిబుగ్గ: వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో రోగుల వైద్యసేవల్లో నిర్లక్ష్యం చేస్తున్న సిబ్బంది తీరు, ఆస్పత్రి సమస్యలపై డీఎంఈ (డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌) డాక్టర్‌ వాణి ఆరా తీశారు. అలాగే, కలెక్టర్‌ సత్యశారద కూడా అధికారుల నుంచి నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. ఆయా వార్డుల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిపై ఎంజీఎం అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘మహాత్మా’.. మారేదెప్పుడు? శీర్షికన సాక్షిలో గురువారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. వైద్యసేవల్లో నిర్లక్ష్యం చేస్తున్న మందలించారు. అలాగే, ఓపీ విభాగాలు, వార్డుల్లో రౌండ్‌ నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంఈ వాణి మాట్లాడుతూ ఎంజీఎంలో సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, పేషెంట్లకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అదనపు వైద్యుల నియామకానికి చర్యలు తీసుకుంటామన్నా రు. ఆర్‌ఎంఓలు పూర్తిగా ఉండేలా, వైద్యసేవలను మెరుగుపరిచేందుకు అదనపు ఆర్‌ఎంఓల నియామకానికి ఆదేశాలు ఇస్తామని వివరించారు. స్టె చర్లు, వీల్‌చైర్లు అందుబాటులో ఉండేలా చూస్తామ ని, త్వరలో అధికారులతో సమీక్షిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement