సీపీ శ్వేత, హనుమకొండ కలెక్టర్ చాహత్
హన్మకొండ అర్బన్: రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్‌న్.శ్వేత, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లాస్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించేలా చూడాలని సూచించారు. ప్రైవేట్ బస్సులు, టాక్సీలను రంగలీల మైదానం, హయగ్రీవాచారి మైదానాల్లో పార్కింగ్ చేసేలా చర్యలు చేపట్టాలని అన్నారు. కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్ మాట్లాడుతూ హసన్‌పర్తి చెరువు కట్ట వద్ద రోడ్డు విస్తరణ పూర్తయినందున డివైడర్లు ఏర్పాటు చేయాలని, పోతననగర్‌లో డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని సూచించారు. మట్టి గణపతి విగ్రహాలపై అవగాహన కల్పించాలని కోరారు. సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, అదనపు కలెక్టర్లు ఎన్..రవి, శేషాద్రి, గ్రేటర్ కమిషనర్ వెంకన్న, ఎన్‌హెచ్ ప్రాజెక్టు డైరెక్టర్ భరద్వాజ్, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, కుడా సీపీఓ అజిత్‌రెడ్డి ఉన్నారు.
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
జిల్లాలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం పలు శాఖల అధికారుల సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. ఇంకా మొదలుకాని సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీఓ భవనాల నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలన్నారు. మళ్లీ వారం రోజుల్లో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ (ఇన్‌చార్జ్) శేషాద్రి, డీఆర్‌డీఓ మేన శ్రీను, పంచాయతీరాజ్ ఎస్‌ఈ శ్రీనివాస్‌రావు, డీఈలు శ్రీనివాసరావు, రాజ గోపాల్, శిరీష, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.


