వరంగల్ క్రైం: అతను చేసేది హైదరాబాద్‌లో సె క్యూరిటీ గార్డు ఉద్యోగం. కానీ, చేసేది సైబర్ నేరాలు. ఫోన్‌లో ప్రముఖ ఐటీ కంపెనీ ప్రతినిధిగా తనను తాను పరిచయం చేసుకుని, ఉద్యోగులకు ఆ హారం సరఫరా చేసే క్యాటరింగ్ కాంట్రాక్టులు ఇప్పిస్తానని నమ్మించి హాస్టల్ యజమానులను మోసం చేస్తున్న అంతర్ జిల్లా సైబర్ మోసగాడిని హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు. మంగళవారం సాయంత్రం కమిషనరేట్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలు వెల్లడించారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం మలక్‌పల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ షబ్బీర్ అలి యాస్ కిరణ్‌కుమార్, అలియాస్ శ్రీకాంత్‌రెడ్డి, అలి యాస్ నర్సింహారెడ్డి, అలియాస్ నరేందర్‌రెడ్డి పేర్లతో చలామణి అవుతున్నాడని తెలిపారు. అతను హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డు ఉద్యోగం చేస్తూ.. సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో సైబర్ నేరాలని ప్రవృత్తిగా ఎంచుకున్నట్లు చెప్పా రు. సెల్‌నంబర్లు మార్చుతూ హాస్టల్ యజమానులను లక్ష్యంగా చేసుకుని హాస్టల్ బోర్డులపై ఉన్న మొబైల్ నంబర్లను సేకరించి, వివిధ నంబర్ల ద్వారా వాటి యజమానులను సంప్రదించేవాడని చెప్పారు. తాను ప్రముఖ కంపెనీ ఉద్యోగి, ప్రతినిధినని పరిచయం చేసుకుని, ఆ కంపెనీ ఉద్యోగులకు ఆహారం క్యాటరింగ్ కాంట్రాక్టులు ఇప్పిస్తానని, ఇందుకు ప్రాసెస్ ఉంటుందని నమ్మించి డబ్బులు నేరుగా అకౌంట్‌లో వేయించుకునేడవా డని వివరించారు. హనుమకొండ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుతో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత ఆధ్వర్యంలో విచారణ చేపట్టగా రాష్ట్రవ్యాప్తంగా 23 కేసుల్లో ఇతని ప్రమేయం ఉన్నట్లు తేలిందన్నారు.
కేసులు ఇలా...
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హనుమకొండలో 3, కేయూసీ – 2, సుబేదారి–1, మిల్స్‌కాలనీ – 1, మట్టెవాడ –1, సీసీపీఎస్–1, జనగా మ– 1 మొత్తం 10 కేసులు నమోదైనట్లు ఆమె తెలి పారు. ఈ కేసుల్లో రూ.22.44లక్షలు కొల్ల గొట్టగా పోలీసులు రూ.11,33,511లను బ్యాంకుల్లో పుట్ ఆన్‌హోల్డ్ చేసినట్లు సీపీ తెలిపారు. దీంతోపాటు ఖమ్మం జిల్లాలో 3, నిర్మల్‌లో 1, నిజామాబాద్‌లో 1, కరీంనగర్‌లో 1, హైదరాబాద్‌లో 1 కేసులో రూ. 10,89,950 కొల్లగొట్టగా, బ్యాంకుల్లో రూ.1,07, 146లను పుట్ ఆన్‌హోల్డ్ చేసినట్లు ఆమె తెలిపారు. నిందితుడికి మరో 6 కేసుల్లో ప్రమేయం ఉందని, అందులో రూ.3,65,050 కొల్లగొట్టగా రూ.68,430 లను పుట్‌ఆన్‌హోల్డ్ చేసినట్లు సీపీ వివరించారు. నిందితుడినుంచి 3 మొబైల్‌ఫోన్లు, 3 సిమ్ కార్డులు, 2 బ్యాంకు పాస్‌బుక్‌లు, ఒక చెక్‌బుక్, 2 ఏటీఎం కార్డులు, డైరీని స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వివరించారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన హనుమకొండ ఏసీపీ నరసింహారావు, ఇన్‌స్పెక్టర్ శివకుమార్, సిబ్బందిని సీపీ అభినందించారు. సీపీ వెంట డీసీపీ దార కవిత ఉన్నారు.
క్యాటరింగ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని మోసం
పలు పేర్లతో చలామణి..
రాష్ట్ర వ్యాప్తంగా 23 కేసులు
నిందితుడి అరెస్ట్.. వివరాలు వెల్లడించిన వరంగల్ సీపీ


