బెటాలియన్‌ కానిస్టేబుళ్లపై దాడి పట్టదా? | - | Sakshi
Sakshi News home page

బెటాలియన్‌ కానిస్టేబుళ్లపై దాడి పట్టదా?

Aug 26 2026 1:30 AM | Updated on Aug 26 2026 1:30 AM

బెటాలియన్‌ కానిస్టేబుళ్లపై దాడి పట్టదా?

సుమోటోగా కేసు నమోదు :

దార కవిత సెంట్రల్‌ జోన్‌ డీసీపీ

వరంగల్‌ క్రైం/ఖిలావరంగల్‌: వరంగల్‌ మిల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఉర్సుగుట్ట వద్ద ఓ బార్‌అండ్‌ రెస్టారెంట్‌ ఎదుట ఇద్దరు 4వ బెటాలియన్‌ కానిస్టేబుళ్లపై జరిగిన దాడిలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం సోషల్‌ మీడియాలో మరో వీడియో వైరలైంది. ఇద్దరు బార్‌ ఉద్యోగులు బెటాలియన్‌ కానిస్టేబుళ్లపై కర్రలతో చేసిన దాడి ఒళ్లు జలదిరించేలా ఉంది. అప్పటికే తీవ్ర గాయాలతో ఉన్న కానిస్టేబుల్‌ను మరోసారి ఒకరు పట్టుకుంటే మరొకరు కర్రతో దాడి చేయడం వీడియోలో స్పష్టంగా ఉంది. ఈ ఘటన ఈనెల 19న రాత్రి 9.45 గంటలకు జరిగినా మంగళవారం వరకు బార్‌ ఉద్యోగులపై కేసు నమోదు చేయలేదు. కానీ, మిల్స్‌కాలనీ బీట్‌ కానిస్టేబుల్‌ సంతోష్‌రెడ్డి ఫిర్యాదు మేరకు బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఉద్యోగుల చేతిలో, ఆ కానిస్టేబుల్‌ దాడిలో తీవ్రస్థాయిలో దెబ్బలు తిన్న బెటాలియన్‌ కానిస్టేబుళ్లపై మాత్రం రాత్రికి రాత్రే కేసు నమోదు చేయడం గమనార్హం. దాడిలో గాయపడిన వారిలో ఒకరు మద్యం మత్తులో ఉండగా మరో కానిస్టేబుల్‌ సాధారణంగా ఉన్నట్లు తెలిసింది. మిల్స్‌కాలనీ బీట్‌ కానిస్టేబుల్‌ సంతోష్‌రెడ్డిని చెంపపై ఒక దెబ్బ కొడితేనే పోలీస్‌ అధికారులు కేసు నమోదు చేసినప్పడు ఆ కానిస్టే బుల్‌తోపాటు మరో ఇద్దరు విచక్షణారహితంగా కర్రలతో దాడి చేసినా ఎందుకు కేసు నమోదు చేయలేదు..? అన్న ప్రశ్నకు సమాధానం కరువైంది. సదరు బార్‌అండ్‌రెస్టారెంట్‌ యజమానితోపాటు మద్యం మాఫియాలు రంగంలోకి దిగి పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం సాగుతోంది. కాగా, టీజీ కానిస్టేబుల్‌పై బీట్‌ కానిస్టేబుల్‌ జరిపిన దాడి మిషయంపై శాఖాపరమైన విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ఈనెల 19న రాత్రి మిల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన దాడిలో బెటాలియన్‌ కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయని డీసీపీ దార కవిత మంగళవారం తెలిపారు. బాధితులను పిలిచి ఫిర్యాదు చేయాలని కోరగా స్పందించలేదని చెప్పారు. అందుకే కేసు నమోదు చేయలేదని, మంగళవారం సుమోటో కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

కేసు నమోదులో జాప్యం

సుమెటోగా కేసు పెట్టామన్న డీసీపీ

తాజాగా మరో వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement