కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి లోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో పీజీ కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈనెల 29న నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదావేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ తెలిపారు. మిగతావి షెడ్యూల్ ప్రకారం యథావిధిగా జరుగుతాయని తెలిపారు. 29న వాయిదా వేసిన ఆ పరీక్షలు మళ్లీ సెప్టెంబర్2న నిర్వహించనున్నామని పేర్కొన్నారు. హైకోర్టు ప్రాసెస్ సర్వర్ పరీక్షల నేపథ్యంలో 29న జరగాల్సి న పరీక్షలను వాయిదావేశామని తెలిపారు. పూర్తి వివరాలకు కేయూ వెబ్‌సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. కాకతీయ.ఏసి.ఇన్‌లోచూడాలన్నారు.
ఉత్తమ స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంగా అనిత
కాశిబుగ్గ : వరంగల్ లేబర్‌కాలనీలోని ప్రభుత్వ గ్రేయిన్ మార్కెట్ పాఠశాల హెచ్‌ఎం కుమ్మరి అని త రాష్ట్రస్థాయి ఉత్తమ స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంగా ఎంపికై ంది. పాఠశాల సముదాయంలోని అన్ని పా ఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందిండంతో పాటు సమర్థవంతమైన అడ్మినిస్ట్రేషన్ అందించడం, అంకితభావంతో అందించిన సేవలను గుర్తించి ఉత్తమంగా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణి, కమిషనర్ అండ్ డైరెక్టర్ నవీన్ నికోలస్‌లు ఆమెకు ప్రశంసపత్రం అందజేసి ఘనంగా సన్మానం చేశారు. మంగళవారం పాఠశాలలో రిటైర్డు ఎంఈఓ గంప అశోక్‌కుమార్‌తోపాటు ఉపాధ్యాయులు సత్కరించారు.
● జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న
వరంగల్ అర్బన్: నగరానికి అందం.. పర్యావరణానికి ప్రాణం మొక్కలే అని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న అన్నారు. వనమహోత్సవంలో భాగంగా మంగళవారం వరంగల్ తోట మైదానంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మొక్కలు నాటుదాం.. వరంగల్‌ను పచ్చని నగరంగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు. మాజీ కార్పొరేటర్ బస్వరాజ్ కుమారస్వామి, సీహెచ్‌ఓ లక్ష్మారెడ్డి, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
పారిశుద్ధ్య నిర్వహణను పటిష్టం చేయాలి..
పారిశుద్ధ్య నిర్వహణను మరింత పటిష్టం చేయాలని కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. నగరంలోని పలు డివిజన్లలో ఆయన పర్యటించి చెత్త సేకరణ, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మోడల్ డివిజన్‌గా ఎంపిక చేసిన 13వ డివిజన్‌న్‌లోని శ్రీనివాసకాలనీ, నవయుగ కాలనీలో పర్యటించిన కమిషనర్ ఇంటింటా తడిపొడి చెత్త సేకరణ తీరును పరిశీలించారు. శానిటరీ సూపర్‌వైజర్ గోపాల్, శానిటరీ ఇనన్‌స్పెక్టర్ ప్రశాంతి, ఎంహెచ్‌ఓ రాజేశ్ ఉన్నారు.


